Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుసోపూర్ లో వింత వ్యాధులతో మృత్యువాత పడుతున్న పశువులు

సోపూర్ లో వింత వ్యాధులతో మృత్యువాత పడుతున్న పశువులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సోపూర్ అనే గ్రామంలో పశువులు వింత వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయని గ్రామ రైతులు తెలిపారు. పశువులకు వ్యాధులు సోకడతో వింతగా ప్రవర్తిస్తున్నాయని, నల్లగా ఉన్న కళ్ళు, ఎర్రగా, తెలుపు రంగులు మారడం, శరీరంపై దద్దులు రావడం, చర్మం ప పొర లేచిపోవడం, ముక్కు ద్వారా జిగురుగా పలుచటి చీమిడి కారుతున్నాయి. మేత మేయకపోవడంతో శరీరం అంత వేడిగా జ్వరంతో ఉండడం, గొంతు భాగం నుండి కాళ్ల వరకు మధ్యలో వాపుగా మారుతున్నాయి. పశువుల కాళ్లు ఉబ్బిపోవడం, నీరు త్రాగడం లేదు. దీంతో గ్రామస్తులంతా పశువులకు కరోనా సోకిందనే ప్రచారం జరిగిందని, భయభ్రాంతులకు గురి అవుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

1962 టోల్ ఫ్రీ నెంబర్ గల పశు సంచార వైద్య వాహనానికి ఫోను పలుమార్లు చేసినప్పటికీ స్పందించలేదని గ్రామస్థులు తెలిపారు. స్థానిక వైద్యులు గ్రామాలలోకి రాక పోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడంతో మారుమూల గ్రామం సోపూర్లో ఇలా సంఘటనలు జరిగినా పట్టించుకోకపోవడంతో రాబోయే రెండు మూడు రోజులలో భారీగా పశు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇవేగాక గ్రామంలో పలువురు రైతుల ఇండ్లలో మూగజీవాలు, పశువులు వివిధ రకాలైన వ్యాధులతో అనారోగ్యంగా ఉన్నాయని, వెంటనే గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad