న్యూఢిల్లీ : ఇరాన్-ఇజ్రాయిల్ వివాదం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో మార్చి 5న జరగాల్సిన 10,12వ తరగతుల బోర్డు పరీక్షను వాయిదా వేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) మంగళవారం ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యుఎఇలలో మార్చి 5న జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించిందని సిబిఎస్‌ఇ పరీక్షా కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ పేర్కొన్నారు. పరీక్షల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని, తదుపరి పరీక్షలకోసం మార్చి 5న పరిస్థితిని సమీక్షిస్తామని ఆయన తెలిపారు. మార్చి 2న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.



