Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జెన్కోలో కోల్పోయిన పారెస్ట్ భూమిని పరిశీలించిన సిసిఏప్

జెన్కోలో కోల్పోయిన పారెస్ట్ భూమిని పరిశీలించిన సిసిఏప్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచర్లలోని కాపురం ఓసిపి బ్లాక్-1 ఉపరితల గని బొగ్గు తవ్వకాల్లో కోల్పోయిన పారెస్ట్ భూమిని ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన అటవీశాఖ సిసిఏప్ డాక్టర్ ప్రభాకర్ తన బృందంతో కలిసి బుధవారం పరిశీలించారు. భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాoట్ లో విద్యుత్ ఉత్పత్తి కోసం కోల్ అవసరం నిమిత్తం జెన్కో కంపెనీ చెపట్టిన భూ సేకరణలో భాగంగా 2008లో తాడిచర్ల సెక్షన్,కాపురం బిట్ పరిదిలోగల 38 హెక్టార్ల అటవీశాఖ భూమిని సేకరించి, 2018లో  భూమిని స్వాధీనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిఏప్ఓ నవీన్ రెడ్డి,ఏప్ డిఓ అప్పల కొండ,కొయ్యుర్ రేంజర్ రాజేశ్వర్ రావు,తాడిచర్ల సెక్షన్ అధికారి గొడుగు లక్ష్మన్,బిట్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad