Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్మసీదులో సీసీ కెమెరా ఏర్పాటు..

మసీదులో సీసీ కెమెరా ఏర్పాటు..

- Advertisement -

సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్ఐ మహేందర్
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని మసీదుల్లో మసీద్ కమిటీ తరఫున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎస్సై మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండడంతో గ్రామీణ, పట్టణ ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో బిగించుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పోలీస్‌ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా నేర పరిశోధన వేగంగా పూర్తి చేసేందుకు పోలీసులకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా ప్రధాన వీధుల సంఖ్యను బట్టి ఏర్పాటు చేసుకునేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కేసుల విచారణలో ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -