ప్రారంభించిన బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ
సీసీ కెమెరాల ఏర్పాటుతో మందిరానికి రథం గల్లీకి రక్షణ
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రతం గల్లీలో గల శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ ఆవరణంలో చుట్టుపక్కల సీసీ కెమెరాల ఏర్పాటును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వాటిని బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై విజయ్ కొండ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆలయానికి, రథం గల్లికి రక్షణగా ఉంటాయని వారు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీని సీఐ, ఎస్ఐలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సందూర్వార్ హనుమాన్లు వైస్ చైర్మన్ బండి వార్ లక్ష్మణ్, కోశాధికారి నాగేష్ కంచినివార్, ఆలయ పూజారి బండి వార్ గంగారాం, శ్రీ శేత్కరి గణేష్ మండలి ముఖ్య నాయకులు గంగాధర్, చాట్లవార్ హనుమాన్లు, గల్లి పెద్దలు, హనుమాన్లు, కంచిన్ వార్ గల్లి ప్రజలు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీ నారాయణ ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES