Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సద్దుల బతుకమ్మను సంబరంగా జరుపుకోండి..

సద్దుల బతుకమ్మను సంబరంగా జరుపుకోండి..

- Advertisement -

– తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – కాటారం 

తీరొక్క పూలతో సద్దుల బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ సంబరాలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకుని ఆఖరున సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, మహిళలు జరుపుకునే గొప్ప పండుగ అని అన్నారు. భవిష్యత్‌లో కూడా బతుకమ్మ వేడుకలను ప్రతి మహిళ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంథని నియోజకవర్గంలోని మహిళలకు, ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -