Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు జయంతి వేడుకలు 

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు జయంతి వేడుకలు 

- Advertisement -

పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టిపిసిసి, ప్రభుత్వ సలహాదారులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు జయంతి సందర్భంగా నెహ్రూ పార్క్ వద్ద గల మహనీయుని విగ్రహానికి( జవహర్‌లాల్ నెహ్రు) విగ్రహానికి, భారీ గజ మాలతో  టీపిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఉర్దూ అకాడమి చైర్మెన్ తాహార్బిన్, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -