Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపకులు జయంతి వేడుకలు

ఘనంగా సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపకులు జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వ్యవస్థాపకులు సోరాబ్జీ పోచ్కన్ వాల 144 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింద ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్  సృంజేయ్ పాల్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది ఆధ్వర్యంలో ఖాతాదారుల సమక్షంలో సోరాబ్జీ పోచ్కన్ వాల జయంతి సందర్భంగా బ్యాంకు ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ సృంజేయ్ పాల్ మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్వదేశీ బ్యాంకు 1911 సంవత్సరంలో స్థాపించడం జరిగిందన్నారు. 114 సంవత్సరాల క్రితం బ్యాంక్ ఏర్పాటు కావడంతో ఖాతాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఘనత వ్వవస్థకులు సోరాబ్జీ పోచకన్వాలకే దక్కిందన్నారు. గ్రామీణ స్థాయిలో ఏర్పాటుచేసిన సెంట్రల్ బ్యాంక్ సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకు గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. ప్రతి ఖాతాదారునికి సేవలు అందించడమే బ్యాంకు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాకేష్, క్యాషియర్ శ్రీకాంత్, బ్యాంకు సిబ్బంది రమేష్, బ్యాంకు ఖాతాదారులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img