Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు

రేపు చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
భూమికోసం,భుక్తికోసం,వెట్టి చాకిరి విముక్తికోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని ఐలమ్మ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు శ్రీ బాపూజి రజక సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం (రేపు) ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో గ్రామంలోని మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, కుల సంఘాల ప్రతినిధులు, యువజన–విద్యార్థి నాయకులు పాల్గొననున్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై,ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -