Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన చలకుర్తి చిన్నారులు

మరోసారి అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన చలకుర్తి చిన్నారులు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
కరాటే ఇండియా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో క్రియేటివ్ కరాటే వారు వరంగల్ లో రాజీవ్ గాంధీ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 34 వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ పోటీలలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సంతోష్ కుమార్  కుమార్తె పాతనబోయిన సుదీక్ష పాల్గొని విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం, కట- విభాగంలో ద్వితీయ స్థానం సాధించి చిన్నారి వెండి పతకం కైవసం చేసుకుంది.

అదేవిదంగా సంతోష్ కుమార్ కుమారుడు పాతనబోయిన విహాస్ కూడా కుమితే విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం, కట- విభాగంలో ద్వితీయ స్థానం సాధించి వెండి పతకం కైవసం చేదుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుండే శిక్షణ ఇప్పించి నిరంతరం తమవెంట ఉండి నడిపిస్తున్న తల్లితండ్రులకు , శిక్షణలో మెళకువలు నేర్పించి మంచి మంచి అవకాశాలు ఏర్పాటు చేసిన కోచ్ మహేష్ నాయక్ మాస్టర్  చిన్నారుల తల్లిదండ్రులు,గ్రామస్తులు ధన్యవాదాలు తెలియచేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -