Thursday, November 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్చలో ఉట్నూర్ పోస్టర్ల విడుదల..

చలో ఉట్నూర్ పోస్టర్ల విడుదల..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్
చట్ట బద్ధత లేని లంబాడాలను ఎస్ టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ పర్ధాన్ సమాజ్ జిల్లా అధ్యక్షులు ఉయిక సుదర్శన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసుల ధర్మ యుద్ధం, చలో ఉట్నూర్ పోస్టర్ లను గురువారం ఆదివాసీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈనెల 23న ఉట్నూర్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఉట్నూర్ లో జరిగే బహిరంగ సభకి మండల ఆదివాసులు పెద్దమొత్తంలో తరలిరావాలని కోరారు. వారితో కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు దయానంద్, సిడాం చందు, గంగాధర్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -