Sunday, November 2, 2025
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ హైదరాబాద్‌

చాంపియన్‌ హైదరాబాద్‌

- Advertisement -

ఫైనల్లో పంజాబ్‌పై ఘన విజయం

రాజ్‌కోట్‌ : వినూ మన్కడ్‌ ట్రోఫీ విజేతగా హైదరాబాద్‌ నిలిచింది. రాజ్‌కోట్‌లో శనివారం జరిగిన ఫైనల్లో పంజాబ్‌పై హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 28.2 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్‌ బౌలర్లు యశ్‌వీర్‌ (3/22), మాలిక్‌ (2/21), నిపున్‌ రెడ్డి (2/24), అహ్మద్‌ (2/25)లు విజంభించారు. అలంకత్‌ రాపోల్‌ (58 నాటౌట్‌, 70 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో రాణించటంతో 112 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 5 వికెట్లు కోల్పోయి 29.3 ఓవర్లలో ఛేదించింది. వినూ మన్కడ్‌ ట్రోఫీ చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టు హెచ్‌సీఏ సింగిల్‌ మెంబర్‌ కమిటీ జస్టిస్‌ నవీన్‌ రావు అభినందించారు. ఆటగాళ్లకు రూ. 2 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -