Tuesday, December 23, 2025
E-PAPER
Homeసినిమా'ఛాంపియన్‌' రిలీజ్‌కి రెడీ

‘ఛాంపియన్‌’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

స్వప్న సినిమాస్‌ అప్‌ కమింగ్‌ మూవీ ‘ఛాంపియన్‌’. రోషన్‌, అనస్వర రాజన్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ వైజాగ్‌లో గ్రాండ్‌గా ఛాంపియన్‌ నైట్‌ ఈవెంట్‌ నిర్వహించారు.
హీరో రోషన్‌ మాట్లాడుతూ,’దర్శకుడు ప్రదీప్‌ ఈ ప్రాజెక్టు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఈ సినిమా తప్పితే మరో సినిమా చేయనని అప్పుడే డిసైడ్‌ అయిపోయాను. ప్రదీప్‌ విజన్‌ని స్వప్న నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకువెళ్లారు. ఎందుకంటే ఆమె పీరియడ్‌ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్‌. బైరాన్‌ పల్లి వీరులందరికీ థ్యాంక్యూ. వైజయంతిలో సినిమా చేయడం అదష్టంగా భావిస్తున్నాను. మొన్నటి వరకు వచ్చిన టెన్షన్‌ ఉండేది.

ట్రైలర్‌ వచ్చిన తర్వాత, ఎడిట్‌ చూసిన తర్వాత 100% హిట్‌ కొడతామని నమ్మకం వచ్చేసింది’ అని తెలిపారు. ‘తెలుగులో రిలీజ్‌ అవుతున్న నా మొదటి సినిమా ఇది. డైరెక్టర్‌ ప్రదీప్‌కి థ్యాంక్యూ. ఈనెల 25 తర్వాత రోషన్‌ని అందరూ ప్రేమిస్తారు. తను కచ్చితంగా చాంపియన్‌ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్‌ పేరు చంద్రకళ. తప్పకుండా అలరిస్తాను’ అనిహీరోయిన్‌ అనస్వర రాజన్‌ చెప్పారు. ఊహ మాట్లాడుతూ,’రోషన్‌ మూడేళ్లు ఎదురు చూశాడు. దానికి ఆన్సర్‌గా ఈ సినిమా మీరు చూస్తున్నారు. మైఖేల్‌గా తనకి అవకాశం ఇచ్చిన ప్రదీప్‌కి థ్యాంక్యూ. దత్‌, కిరణ్‌, అందరూ రోషన్‌ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాళ్ళ సంస్థలో రోషన్‌ రీలాంచ్‌ అవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. రామ్‌ మిరియాల, కాసర్ల శ్యామ్‌, రచ్చ రవి తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -