Monday, October 6, 2025
E-PAPER
Homeసినిమాక్రిస్మస్‌ కానుకగా 'ఛాంపియన్‌' రిలీజ్‌

క్రిస్మస్‌ కానుకగా ‘ఛాంపియన్‌’ రిలీజ్‌

- Advertisement -

హీరో రోషన్‌ తన లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘ఛాంపియన్‌’తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామాను జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ”ఛాంపియన్‌’ ఫస్ట్‌లుక్‌, ఆసక్తికరమైన టీజర్‌ గ్లింప్స్‌ హ్యుజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. పండుగ సీజన్‌, న్యూ ఇయర్‌ హాలిడేస్‌లో వస్తున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ బిగ్‌ బూస్ట్‌ ఇవ్వనుంది.
రిలీజ్‌ పోస్టర్‌లో రోషన్‌ లాంగ్‌ డార్క్‌ ఓవర్‌కోట్‌, బెల్టెడ్‌ వెయిస్ట్‌తో క్లాసీ లుక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ నుంచి బయటకు అడుగుపెడుతూ హీరోయిక్‌ ఎంట్రీ ఇవ్వడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాలో రోషన్‌ ఇప్పటివరకు చేయని విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. పాత్రకు సరిపోయేలా ఆయన ఫిజికల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కూడా అయ్యారు’ అని చిత్ర బృందం తెలిపింది. ‘ఇదొక పీరియాడిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా. ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ముఖ్యంగా హీరో రోషన్‌ పాత్ర చాలా వినూత్నంగా ఉంటుంది. ఇలాంటి పాత్రను ఆయన పోషించడం ఇదే తొలిసారి. ఈ పాత్రలో ఆయన నటించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తాయనే నమ్మకం ఉంది. దర్శకుడు ప్రదీప్‌ అద్వైత్వం సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. రోషన్‌, అనశ్వర రాజన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: ప్రదీప్‌ అద్వైతం, డీఓపీ : ఆర్‌ మదీ, సంగీతం: మిక్కీ జె మేయర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: తోట తరణి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -