- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరును బిజెపి ప్రభుత్వం మార్చడం సరైనది కాదని పంచాయితీ రాజ్ సంఘటన కామారెడ్డి జిల్లా కన్వీనర్ గిరెడ్డి మహేందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశానికి స్వతంత్రం తేవటంలో మహాత్మా గాంధీ పాత్ర ఎనలేనిదని, ప్రపంచానికే శాంతికపోతంగా పేరుగాంచిన మహాత్మా గాంధీ, ఎలాంటి పదవులను ఆశించకుండా దేశానికి సేవ చేసిన గొప్ప నాయకుడని, అలాంటి నాయకుడి పేరు మార్చి దేశ ప్రతిష్టను అవమానపరచడం సరైనది కాదని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -



