Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్రథోత్సవాలు.. మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

రథోత్సవాలు.. మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో ఈ నెల 12, 13, రెండు రోజులపాటు నిర్వహించే శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాల ఉత్సవాల కార్యక్రమానికి హాజరు కావాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ను శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ శుక్రవారం ఆహ్వాన పత్రాన్ని అందజేసింది. ఈ ఆహ్వాన పత్ర అందజేత కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సందూర్వార్ హనుమాన్లు, గోశాల కమిటీ చైర్మన్ గాన్ల సంజయ్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ బండి లక్ష్మణ్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకల్ వార్ విజయ్ కుమార్, వీరితోపాటు ఆవార్వార్ హనుమాన్లు, సందూర్ వార్ అశోక్, తులసిరామ్, కత్గావ్ మాజీ సర్పంచ్ హనుమాన్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -