Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి కబడ్డీ  పోటీలకు చెన్నూర్ విద్యార్థినిల ఎంపిక 

రాష్ట్ర స్థాయి కబడ్డీ  పోటీలకు చెన్నూర్ విద్యార్థినిల ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మండలంలోని చెన్నూరు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న చిలువేరు రేవతి, మంచాల అంజలి లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పుష్కూరి రమేష్ రావు తెలిపారు. బుధవారం పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కొడిశాల అశోక్ తో కలిసి రమేష్ రావు మాట్లాడుతూ ఈనెల 20న జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లు ల జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో రేవతి, అంజలి ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఈనెల 25, 26, 27 తేదీలలో నిజామాబాద్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన రేవతి, అంజలీలను ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని, విద్యార్థులు అభినందించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభను కనబరిచి చెన్నూరు ఉన్నత పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థినీలను ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ ఓరిగంటి సురేష్, స్టాఫ్ సెక్రటరీ శ్రీనివాస్ గుప్తా, శోభ, శ్రీహరి, శ్రీష్మ, ఫాతిమా మేరీ, రాణి, వకుళ, ఉమారాణి, వెంకటేష్, చైతన్య, వరలక్ష్మి, క్రాంతికుమార్, ధనలక్ష్మి, గ్రామ పెద్దలు అభినందించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -