Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఈ నెల 19వ తేదీన జరగనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శివాజీ మండల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు పవిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో మహావీరుడు, సమర్థవంతమైన పాలకుడు అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన శివాజీ ధైర్యం, తెలివితేటలు, వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన నాయకుడని తెలిపారు. మహిళల పట్ల గౌరవం చూపిన మహానుభావుడిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని అన్నారు.

జయంతి ఉత్సవాల సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఉత్సవాలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటారం సర్పంచ్ పంతకాని సడవలిని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అలాగే ఆదర్శ నగర్ కాలనీ, శ్రీపాద కాలనీ, గణేష్ నగర్ కాలనీ వాసులను కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కమిటీ సభ్యులు కోట్టే శంకరయ్య, పవిత్రం శ్రీనివాస్, ఉన్నం అంజయ్య, చీమల రాజు, గోనె మహేష్, మారగోని సంతోష్, కోట్టే సతీష్, పసుల సందీప్ తదితరులు, పలు కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -