- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రేషన్ కార్డులో పేరు ఉండి, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువతకు ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ శుభవార్త తెలిపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళలకు బ్యూటీ పార్లర్, టైలరింగ్ కోర్సుల్లో 30 రోజుల ఉచిత శిక్షణ, వసతి, భోజనం, శిక్షణ సామగ్రి అందించనుంది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌తో పాటు స్వయం ఉపాధి కోసం ముద్ర లోన్ సదుపాయం కూడా కల్పిస్తారు. దీనికి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. ఆసక్తిగల వారు ఈ నెల 27లోపు దరఖాస్తు చేసుకోచ్చు.
- Advertisement -



