Friday, July 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచెక్ బౌన్స్ కేసులో హీరోకు ఏడాది జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో హీరోకు ఏడాది జైలు శిక్ష

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళ నటుడు, నిర్మాత విమల్ చెక్ బౌన్స్ కేసులో చెన్నై చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ‘మన్నర్ వాగైయరా’ చిత్రం నిర్మాణం కోసం ఫైనాన్షియర్ గోపి వద్ద నుంచి తీసుకున్న సుమారు రూ.4.5 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విమల్ విఫలమయ్యారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో గోపి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు విచారణ అనంతరం విమల్‌కు శిక్ష పడింది. అయితే, విమల్ తరపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు కోర్టు శిక్ష అమలుపై తాత్కాలిక స్టే మంజూరు చేసింది, దీంతో విమల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -