Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ గా ఛత్రు నాయక్

మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ గా ఛత్రు నాయక్

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ మహబూబ్నగర్ జోనల్  కోఆర్డినేటర్ గా అమ్రాబాద్ మండలం గిరిజన ప్రాంతం వటవర్లపల్లి గ్రామానికి చెందిన ఛత్రు నాయక్  నియామకం అయ్యారు. గిరిజన బిడ్డ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ను విస్తుంపజేయాలనే నమ్మకంతో జాతీయ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ సునీల్ పవర్  నియమించారు.

జోనల్ కోఆర్డినేటర్ నియమకానికి సహకరించిన పిసిసి ఉపాధ్యక్షులు, జిల్లా డిసిసి అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కు, రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల సిద్దేశ్వర్ కు, కిరణ్ మూగభాష ,నేషనల్ ఇంచార్జ్ సుభాష్ యాకర్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -