Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్బాలల పరిరక్షణ కమిటీ సమావేశం

బాలల పరిరక్షణ కమిటీ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట: కోటగడ్డ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ సెక్రెటరీ లలిత  అధ్యక్షతన, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి లలిత మాట్లాడుతూ..  గ్రామంలో పిల్లల సమస్యలను సమీక్షించడం, మరియు పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా విసిపిసి ద్వారా పరిష్కార మార్గాలను తీర్చే విధంగా విసిపిసి అభివృద్ధి చేయాలని, ప్రతినెల ఫస్ట్ బుధవారం నాడు విసిపిసి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అనంతరంజిల్లా బాలల పరిరక్షణ విభాగం – ములుగు. సోషల్ వర్కర్ బి జ్యోతి మాట్లాడుతూ పిల్లల ఎలాంటి సమస్యలు వాటిలితే వెంటనే 1098, 112 నం  కి ఫోన్ చేసి చెప్తే సమస్యకు పరిష్కార మార్గాలను కల్పిస్తారు వారి భవిష్యత్తుకు తగు మార్గదర్శకలు కల్పిస్తారు. గ్రామంలో అనాధ బాలలకు స్పాన్సర్షిప్ అందించే విధంగా ప్రభుత్వం చూస్తుందని,  గ్రామంలో బాల్య వివాహం జరగకుండా చూడాలని, బాల కార్మికులు లేకుండా బాలల పైన లైంగిక వేధింపులు జరగకుండా చూసే బాధ్యత మనందరి పైన ఉంది అని, అందరికీ చట్టాల పైన అవగాహన ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సోషల్ వర్కర్ – జిల్లా బాలల పరిరక్షణ విభాగం , గ్రామస్థాయి కమిటీ సభ్యులు, అంగన్వాడి కార్యకర్తలు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -