మునిగలవీడు గ్రామ సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునిగిలవీడు గ్రామంలోనీ అంగన్వాడీ టీచర్లు సమయపాలన పాటించి అంగన్వాడికి వచ్చే వారికి పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని ఆ గ్రామ సర్పంచ్ బొల్లి కొండ చైతన్య నాగరాజు అన్నారు. గురువారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పిల్లలకు, గర్భిణీ స్త్రీ లకు పౌష్టికాహారాన్ని సరైన మోతాదులో అందించాలని సూచించారు. బాలామృతం, గుడ్లు అందరికీ సరైన సమయంలో అందించాలని చెప్పారు. అంగన్వాడీ చీచర్లు సమయ పాలన పాటించి, సక్రమంగా వారికి పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు. అంగన్వాడికి వచ్చిన పిల్లలు అంగన్వాడి నుండి ఇంటికి వెళ్లే వరకు టీచర్, ఆయాదే బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వర్డ్ మెంబెర్స్ ఐత వెంకటలక్ష్మి, బొజ్జ రేణుక గర్భిణీ స్త్రీలు బలంతలు కిశోర పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలి: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



