– కనువిందు చేసిన విద్యార్థుల సాంప్రదాయ వేషధారణ
– పండుగ వాతావరణంలో బోనాల వేడుకలు
నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలు సెయింట్ మేరీ హై స్కూల్, లహరి పబ్లిక్ స్కూల్, బ్లూమింగ్ బర్డ్స్ స్కూలో శనివారం నేత్ర పర్వంగా హోరెత్తాయి. బోనాలను సంప్రదాయకరంగా తయారు చేసి, బోనాలతో విద్యార్ధులు అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి, పోతురాజు వేషధారణలతో విద్యార్థులు కనువిందు చేశారు. విద్యార్థినిలు చీరకట్టు సాంప్రదాయ దుస్తులలో బోనాల సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి వేషధారణలతో, పోతురాజు వేషధారణలతో విద్యార్థినీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. అనంతరం బోనాలను సమీప అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా పాఠశాలల నిర్వాహకులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు విశిష్టమైన స్థానంతో పాటు కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలతో మహోన్నత స్థానం ఉందన్నారు. ఆషాడ మాసం, శ్రావణ మాసాలలో బోనాల సంబురాలతో ప్రజానీకం మురిసిపోతున్నారు అని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు బోనాల విశిష్టతను తెలియజేసేందుకు పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాల సంబురాలని జరుపుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీ హెచ్ఎం సోమన్న, లహరి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ రవిచందర్, బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ హెచ్ఎం ఎనగందుల సంతోష్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో బోనమెత్తిన చిన్నారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES