- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నాకు నీవు రక్ష , నీకు నేను రక్ష మనం దేశానికి రక్షగా ఉందాం అంటూ రాఖీ లను కట్టారు. ఈ సందర్భంగా అక్షర పాఠశాల డైరెక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడూ సోదరుడు తనకు రక్షగా తాను సోదరునికి రక్ష గా ఉంటానని తెలిపే ఈ రాఖీ పండగ అని పండగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ వెదిరె అశోక్ రెడ్డి, డైరెక్టర్స్, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -