శ్రీరామ్, మహిమా గుప్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘చింతామణి సొంతకథ’. ప్రేమ్ రాజ్ దర్శకుడు. మిత్రా మూవీ మేకర్స్ బి.రాజీవ్ కుమార్, రాకేష్ కర్రె, డా. ఎన్ వీ రావు, శ్రీనివాస్ పసుపులేటి నిర్మిస్తున్నారు. ఆదివారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్ర ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ డా. అద్దంకి దయాకర్, తెలంగాణ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డా. అద్దంకి దయాకర్ క్లాప్ ఇవ్వగా, జీహెచ్‌ఎంసీ రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ వందనకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
సోషల్ యాక్టివిస్ట్ డా.శ్రీనివాస్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత నివాస్ కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘దర్శకుడు ప్రేమ్ రాజ్ ఒక మంచి కథ చెప్పారు. కథలోని స్ట్రాంగ్ కంటెంట్‌ను నమ్మి మేము సినిమా చేసేందుకు ముందుకొచ్చాం’ అని తెలిపారు. ‘దర్శకుడిగా నాకు నాలుగో చిత్రమిది. ఇది కమర్షియల్ పంథాలో సాగే క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ థ్రిల్లర్ కథైనా ఇందులో భార్య భర్తల మధ్య మంచి డ్రామా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది’ అని డైరెక్టర్ ప్రేమ్ రాజ్ చెప్పారు.
‘చింతామణి సొంత కథ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



