Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి 

సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి 

- Advertisement -

– సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ 
నవతెలంగాణ – కామారెడ్డి 

బుధవారం జిల్లా కేంద్రంలో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభను అన్ని రంగాల కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ భవనంలో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జిల్లా మహాసభ ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అతితెలుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రమ, పాలడుగు సుధాకర్ లు వస్తున్నారన్నారు. ఈ మహాసభకు సీఐటీయూ అనుబంధ రాష్ట్ర, లోకల్ సంఘాల జిల్లా కమిటీ బాధ్యులు, ప్రతి సంఘం మండల స్థాయి లీడర్లు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకొని సిఐటియు నాయకత్వం, అనుబంధ రంగాల నాయకత్వం రావాల్సిన ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చి ఖచ్చితంగా వాళ్లు ఈ మహాసభకు హాజరయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత బాధ్యుల మీదనే ఉంటుందన్నారు. రాష్ట్ర సంఘాలు అంగన్వాడి, ఆశా వర్కర్స్, మున్సిపల్, గ్రామపంచాయతీ, మిడ్ డే మీల్ వర్కర్స్, బీడీ వర్కర్స్, ఐకెపి, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ యూనియన్ ,మెప్మా, ఆటో, హమాలి కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్, గాయత్రి షుగర్స్, మెడికల్  రిప్రజెంటివ్వులు, ఎల్ఐసి, పోస్టల్, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ తదితర రంగాల కార్మికులందరూ హాజరు కావాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -