Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఐటీయూ జెండాల ఆవిష్కరణ

సీఐటీయూ జెండాల ఆవిష్కరణ

- Advertisement -

అఖిలభారత 18వ మహాసభ సన్నాహక కార్యక్రమాలు
విశాఖలో ఈనెల 31 నుంచి జనవరి 4 వరకు మహాసభ


నవతెలంగాణ- విలేకరులు
సీఐటీయూ అఖిలభారత 18వ మహాసభ సందర్భంగా జాతీయ కమిటీ పిలువుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మహాసభ సన్నాహకంగా యూనియన్‌ జెండాలను ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయం వద్ద జెండావిష్కరణ గావించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. మాజీ కార్యదర్శి దర్శనాల మల్లేశ్‌ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట జెండాను ఎగరేశారు. రిమ్స్‌ యూనియన్‌ కమిటీ ఆధ్వర్యంలోనూ జెండా ఆవిష్కరించారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సీఐటీయూ మండల కార్యదర్శి చల్లూరి దేవదాస్‌ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్‌ రాజేందర్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు పెరిక శ్రీకాంత్‌ జెండాను ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సీఐటీయూ కార్యాలయం, టౌన్‌లో మున్సిపాల్‌ టౌన్‌ హాల్‌, బజార్‌ యూనియన్‌, పెనుగొండ హమాలీ యూనియన్‌, సీడబ్ల్యూసీ గోదం, దివిటీపల్లి డబుల్‌ బెడ్‌ రూమ్‌ దగ్గర సీఐటీయూ జెండాలు ఆవిష్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో జెండాను ఎగరవేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -