నవతెలంగాణ – నవాబు పేట
ఈ నెల 20న సీఐటీయూ ఆద్వర్యంలో సమ్మె ఉంటుంది అని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు కమర్ అలీ అన్నారు. ఆదివారం మండల కేంద్రము లోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో సమ్మె గోడ పత్రికను విడుదల చేశారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వరద గాలన్న లతో కలిసి మాట్లాడుతూ మే 20 తారీకు సకల కార్మికులు సమ్మెలో పాల్గొనాలని,కనీస వేతనాల ప్రకారంగా ప్రతి కార్మికుడికి 26000 వేలు నిర్ణయించాలని,ఎనిమిది గంటల పనిని 12, 14 గంటలకు పెంచడం ఉపసంహరించాలని,44 కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోడ్స్ తేవడం ఉపసంహరించాలని, ప్రతి కార్మికుడికి పిఎఫ్ ,ఈఎస్ ఐ, బోనసు ,గ్రాటిటీ పెన్షన్ అమలు చేయాలని భవనిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఎత్తివేసే ఆలోచన కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపసంహరించాలని, అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆటో జీపు తదితర వాహనాల 2023మోటార్ వెహికిల్ చట్టాన్ని రద్దు చేయాలని నితేవసర ధరలను నియంత్రించాలని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ తగ్గించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ సమ్మెలో అంగన్వాడి,ఆశ,మధ్యాహ్నం భోజనము ,వివోఏలు,భవన నిర్మాణ కార్మికులు,గ్రామపంచాయతీ, ఫీల్డ్ అసిస్టెంట్లు,వ్యవసాయ కార్మికులు, రైతులు పెద్దఎత్భున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ మండల నాయకులు రంగయ్య, శ్రీనివాసులు, గ్రామపంచాయతీ నేను నాయకులు రమేష్, శేఖర్ ,పాండు ఆటో డ్రైవర్ శాంతయ్య, రాజు ,పుల్లన్న తదితరులు పాల్గొన్నారు .
సీఐటీయూ ఆద్వర్యంలో 20న సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES