నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ పశ్చిమగోదావరి జిల్లా పూర్వ కార్యదర్శి, ఉమ్మడి ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన చింతకాయల బాబురావు గుండెపోటుతొ మరణించడం బాధాకరమనీ, ఆయన మృతికి సం తాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాపం తెలిపిన వారిలో సీఐటీయూ అఖిల భారత కోశాదికారి ఎం.సాయిబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వీరయ్య, ఆర్.సుధాభాస్కర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఉన్నారు. బాబురావు ప్రజా ఉద్యమాలకు జీవితమంతా అంకితమై పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడారని గుర్తుచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థి, కార్మిక ఉద్యమాల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషిం చారని తెలిపారు. అందరితో ఇట్లే కలిసిపోయే బాబురావు అకాల మరణం కార్మిక పోరాటాలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
చింతకాయల బాబురావు మృతికి సీఐటీయూ సంతాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    