Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోస్టల్‌ యూనియన్‌ నేత కె.రాంచందర్‌ మృతికి సీఐటీయూ సంతాపం

పోస్టల్‌ యూనియన్‌ నేత కె.రాంచందర్‌ మృతికి సీఐటీయూ సంతాపం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పోస్టల్‌ యూనియన్‌ నేత కె.రాంచందర్‌(67) మృతికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాంచందర్‌ ఇటీవలే బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేయించుకున్నారనీ, సర్జరీ అనంతరం పరిస్థితి విషమించి ఆయన మంగళవారం చనిపోయారని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం, భార్య, ఇద్దరు కుమారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పోస్టల్‌ అడ్మినిస్ట్రేషన్‌ యూనియన్‌కు ఉమ్మడి ఏపీలో సుధీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా, ఎన్‌ఎఫ్‌పీఈ సమన్వయ కమిటీ కన్వీనర్‌గా, అఖిల భారత యూనియన్‌ సహాయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైనా, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌, కంటింజెంట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన పట్టుదల పోరాడేవారని కొనియాడారు. ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడంలో, అధికారులతో మాట్లాడి సమన్వయంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించేవారని తెలిపారు. ఆయన మృతికి పోస్టల్‌ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీరని లోటు అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -