Sunday, July 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసిగాచి ప్రమాద బాధితులకు సీఐటీయూ ఆర్ధిక సహాయం

సిగాచి ప్రమాద బాధితులకు సీఐటీయూ ఆర్ధిక సహాయం

- Advertisement -

– గళ్లంతైన11 కుటుంబాలకు ₹. 5 వేల చొప్పున సాయం
– బాధితులకు అండగా ఉంటాము
: చుక్క రాములు
నవతెలంగాణ – హైదరాబాద్: సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో బాధితులైన వారి కుటుంబాలకు సంగారెడ్డి జిల్లా సీఐటీయూ అనుబంధ యూనియన్లు ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామంటూ భరోసా కల్పించింది. సిగాచి పరిశ్రమలు జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు ఆనవాళ్లు లభించకుండా గల్లంతైన 11 మంది కార్మికుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ల కు దిక్కులేని పరిస్థితి లో ఉన్నారు. కనీసం చేతి ఖర్చులకూ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నందున సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు సారర్ధ్యంలో వివిధ కంపెనీల యూనియన్స్ సహకారం తో ఒక్కో కుటుంబానికి ₹. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందచేశారు. పాశమైలారం ఐలా భవన్ వద్ద బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.


ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కార్మికుల్ని ఆదుకోవాలని సదుద్దేశంతో ఆనవాళ్లు లభించని కార్మికుల కుటుంబాలకు సిఐటియు యూనియన్ శాండ్విక్ పరిశ్రమ నుంచి 20000, తోషిబా పరిశ్రమ యూనియన్ నుండి 15,000, సిబిఎల్ పరిశ్రమ యూనియన్ నుంచి 10000, కిర్బీ పరిశ్రమ యూనియన్ నుంచి 10000 వేల చొప్పున మొత్తం ₹.55000 ఆర్థిక సహాయాన్ని కార్మికుల కుటుంబాల సభ్యులకు అందించడం జరిగిందన్నారు.

CITU
CITU

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 50 మంది వరకు మరణించడం చాలా విశాధాకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం లాభాపేక్ష కోసం అను స్కిల్డ్ కార్మికులతో పనిచేయడంతో పాటు కాలం తీరున రియాక్టర్లు ఇతర పరికరాలను వాడడం వల్లే పరిశ్రమల్లో తరచు ప్రమాదంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల నిర్వహణలో జరుగుతున్న లోపాలపై తనిఖీలు చేయకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు చేయడం వలన పెట్టుబడిదారుల ఇష్టారాజ్యంగా మారిందని ఆయన దిగబెట్టారు.

ఫ్యాక్టరీలను తనిఖీ చేయాల్సిన అధికారాలను తగ్గించడం వల్ల యజమానులకు మారిందన్నారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమల్లో డ్రైవర్లు రియాక్టర్లు పేలి సంభవించిన ప్రమాదాల్లో కార్మికులు బిడ్డల్లాగా బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోనే భూపాల్ గ్యాస్ ప్రమాదం తర్వాత ఎంత ప్రాణం నష్టం జరిగినా సంఘటన కేవలం సిగాచి పరిశ్రమదేనని గుర్తు చేశారు. ప్రజల కుటుంబాలను ఆదుకోవడంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్యం చేసిందన్నారు ఇప్పటివరకు ఆచూకీ లభించని కుటుంబాలు ఐదు రోజులుగా పరిశ్రమ చుట్టూ అడిగోప్పలు కాస్తున్న వారిని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ అతిమేల మాణిక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాండు రంగారెడ్డి, బాగారెడ్డి తోషిబా యూనియన్ ప్రధాన కార్యదర్శి అనంత్రావు యూనియన్ల నాయకులు మనోహర్ ప్రసన్న సురేష్ విట్టల్ సంతోష్ మదన్ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

CITU
CITU

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -