బీఎంఎస్‌పై ఘనవిజయం
నిజాయితీకి పట్టంకట్టిన కార్మికులు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-సదాశివపేట
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది గ్రామ పరిధిలోని బ్లూ క్రాఫ్ట్ అగ్రో ప్రయివేటు లిమిటెడ్ పరిశ్రమలో సీఐటీయూ ఘన విజయం సాధించింది. బుధవారం పరిశ్రమలో జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్‌పై సీఐటీయూ విజయం సాధించింది. పరిశ్రమలో మొత్తం 109 ఓట్లు ఉండగా సీఐటీయూకు 59 ఓట్లు, బీఎంఎస్‌కు 50 ఓట్లు వచ్చాయి. దాంతో 9 ఓట్ల మెజార్టీతో సీఐటీయూ విజయం సాధించింది. ఆ పరిశ్రమలో ఈ విజయంతో సీఐటీయూ వరుసగా రెండో సారి విజయం సాధించింది. కంపెనీ వద్ద కార్మికులు విజయోత్సవ సంబురాలు నిర్వహించుకున్నారు.
ఈ సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీఎంఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, అసత్య ప్రచారాలు నిర్వహించినా బ్లూక్రాఫ్ట్ అగ్రో ప్రయివేటు లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు నీతినిజాయితీకి పట్టం కట్టారని తెలిపారు. సీఐటీయూ కార్మికుల సంక్షేమం, కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ పరిశ్రమలో కార్మికులకు మెరుగైన సౌకర్యాలు, మంచి వేతన ఒప్పందం సాధించి పెట్టిన చరిత్ర సీఐటీయూకు ఉందని, ఇటీవల జరిగిన అగ్రిమెంట్ లో కార్మికులకు కొత్త సౌకర్యాలను సాధించి పెట్టడం జరిగిందన్నారు. మొట్టమొదటిసారిగా రిటైర్మెంట్ సర్వీసును పెంచడం జరిగిందని తెలి పారు. అనేక సంవత్సరాల నుంచి కంపెనీ కార్మికులకు సీఐటీయూ నాయకత్వం నిరంతరం అందుబాటులో ఉంటూ నిస్వార్థంతో పనిచేస్తుందన్నారు. ఈ గెలుపు పరిశ్రమ కార్మికుల గెలుపు అని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఓటు వేసి సీఐటీయూను గెలిపించిన కార్మికులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బి.మల్లేశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం, వి.ప్రవీణ్ కుమార్, బ్లూక్రాఫ్ట్ అగ్రో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, జనార్ధన్, వీరేశం, సంజీవులు, వై.రమేష్, జోసఫ్, వీరేశంగౌడ్, సాయిలు, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, మొగులయ్య, నర్సింగ్ రావు, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
‘బ్లూ క్రాఫ్ట్ అగ్రో’లో సీఐటీయూ విజయభేరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


