సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
ఈనెల 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగబోయే అఖిల భారత సీఐటీయూ 18 వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గడ్ తెలిపాడు. మండల కేంద్రంలో ఆల్హమాలి మండల వర్కర్ యూనియన్ సీఐటీయూ మండల కార్యదర్శి కారం రవి జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 31 నుండి జనవరి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరగబోవు అఖిలభారత సీఐటీయూ 18 మహాసభ కు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరినట్లు తెలిపారు.
కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు తక్షణమే అందియాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ నలుగు మూలల నుండి కార్మిక హక్కుల పోరాటా రధసారధులు ప్రతినిధులు, జాతీయ అంతర్జాతీయఅతిరథ మహారధులు హాజరవుతారనీ అన్నారు. మోడీ ప్రభుత్వం తన మిత్రపక్షాలు అండతో మూడోసారి అధికారంలోకి వచ్చి మోడీ నాయకత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్పొరేట్ మిత్రుల ప్రయోజనం కోసం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తుందని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడులను అమలు చేయడానికి సిద్ధమైందని ఈ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9న పెద్ద ఎత్తున సుమారు 25 కోట్ల మంది కార్మిక వర్గం రోడ్డు మీదికి వచ్చి నిరసనలు తెలియజేశారు.
అయినా మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు పరచకుండా కార్మికుల పొట్టలు కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టాలని చూస్తుందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక మోడీ విధానాలను ఈ మహసభలో చర్చిస్తారని ఈ మహాసభల సందర్భంగా ఈ నెల 31న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కారం రవి, ఇసంపల్లి ఐలేష్, హెచ్ శ్రీను, కే శ్రీను ,బి పూజారి, వి ఉప్పలయ్య, బి ఎల్లయ్య ,వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.



