వేసవిలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటి నాణ్యత మెరుగుపడుతుంది. కుండకున్న పోరస్ స్వభావం నీటి నుండి మలినాలను ఫిల్టర్ చేసి, నీటిని శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పిహెచ్ స్థాయిలను స్థిరపరుస్తుంది
కుండలో ఉంచిన నీటి పిహెచ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మట్టిలో ఉండే స్వభావాలు నీటి ఆమ్లతను తటస్థీకరిస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ బలంగా మారి, వేసవిలో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
సహజ చల్లదనం
చల్లటి నీటి కోసం ఫ్రిజ్, వాటర్ ఫ్యూరిఫైర్ వంటి ఎలక్రానిక్ వస్తువుల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం కంటే మట్టి కుండలో నిల్వ చేసుకుంటే నీరు సహజంగా చల్లబడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవేకాకుండా మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలు వున్నాయి.
తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.
వడదెబ్బ సమస్య నుంచి రక్షణ పొందాలనుకుంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరు తాగడమే మంచిది.
మట్టిలో ఉండే వివిధ రకరకాల విటమిన్స్, మినరల్స్ అందులో నిల్వ ఉంచిన నీటికి చేరి శరీరానికి మేలు చేస్తాయి.
కుండలో నిల్వ చేసిన నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ కాలంలో రోజూ కుండ నీటిని తాగితే.. పొట్ట సమస్యల నుండి కూడా ఉపశమనం పొందొచ్చు.
వేసవిలో చెమట వల్ల చర్మం జిడ్డుగా తయారై చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుండ నీళ్లు తాగితే ఆ సమస్యల నుండి దూరం కావచ్చు.
ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది.
మట్టి కుండ నీళ్లు.. ఆరోగ్యానికి మేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



