Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మందనపల్లిలో 13వ రోజుకు పరిశుభ్రత కార్యక్రమం

మందనపల్లిలో 13వ రోజుకు పరిశుభ్రత కార్యక్రమం

- Advertisement -

ఇతర గ్రామాలకు ఆదర్శంగా మందన పల్లి 
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో ప్రతి వార్డులో మురికి కాలువలు కంప చెట్ల తొలగింపు చెత్త చెదారం లేకుండా 13 రోజులుగా ప్రజలు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీలవారు శ్రమదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నూతనంగా గెలుపొందిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు వారి కుటుంబ సభ్యులు పిల్లలతో, వివిధ పార్టీల వారు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమం పంచాయతీ సిబ్బందితో పాటు శ్రమదానంతో కొనసాగుతోంది.గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం వరుసగా 13వ రోజుకు చేరుకుంది.

7వ వార్డులో ఆదివారం కొనసాగింది.మండలంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా మందన పల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాలకవర్గం చేస్తున్న కృషిని మండలంలో ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.ఓటర్లు,వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొని పాలకవర్గానికి మద్దతుగా నిలిచారు. సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువత,గ్రామస్తులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా పాల్గొని తట్టాపారతో మట్టిని ఎత్తివేస్తూ  ఊరికి కాలువలో మురికి నీ తొలగిస్తూ.కంప చెట్లను గొడ్డలి తో నరుకుతూ అక్కడ పోగైన చెత్తని టాక్టర్ ద్వారా ఊరి బయటకు పంపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే మందనపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపాలనే లక్ష్యంతో పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులు సంపూర్ణ సహకారం అందించడం శుభ సూచకంగా మారింది.డిసెంబర్ 29 నుండి వరుసగా13 రోజులుగా ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతున్న ఈ పరిశుభ్రత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందే స్థాయికి చేరుకోనుంది. గ్రామంలో నివసిస్తున్న పౌరులతో పాటు బయట ఉన్న మందనపల్లి గ్రామస్తులు కూడా తమవంతు సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అందిస్తూ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పాలకవర్గం కృతజ్ఞతలు తెలియజేసింది.

ఈ కార్యక్రమంలో మందనపల్లి గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య,ఉప సర్పంచ్ పద్మశ్రీ శశిరేఖా సుదర్శన్,వార్డు సభ్యులు కడకంచి శ్రీలత కృష్ణ,తమ్మడి అంజయ్య,సంచు ఇందిరా రామ్,కడకంచి రాజు,ఊట్కూరి అంజయ్య,కుర్రి సాయికుమార్,గుండు బాలమణి,పంచాయతీ కార్యదర్శి సర్వర్ నాయక్,గ్రామ శాఖ అధ్యక్షులు నోముల వెంకటేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్కూరి సురేష్,అన్నం పెద్ద సిద్దులు,రాచకొండ ఉదయ్,జంగ ప్రమీల, ఆశా వర్కర్ బేతి లక్ష్మి,మహిళా సంఘం అధ్యక్షురాలు ఫంగ సరిత,కుర్రి మార్కండేయ,పారిశుద్ధ్య కార్మికులు పంగ పరుశరాములు,పంగ పద్మ తమ్ముడి రమేష్, తదితరులు పాలకవర్గం గ్రామ ప్రజలు యువత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిరోజు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -