Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్ర ప్రజలకు సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. భద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసిందన్నారు. అందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.351 కోట్లు కేటాయించిందని తెలిపారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -