Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమండలి మరమ్మతులను సీఎం తనిఖీ

మండలి మరమ్మతులను సీఎం తనిఖీ

- Advertisement -

– చైర్మెన్‌, స్పీకర్‌తో కలిసి పరిశీలన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

శాసనమండలి మరమ్మత్తు పనులను మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరిశీలించారు. శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి పనులను తనిఖీ చేశారు. అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి ప్రధాన సమావేశం హాల్‌ను కలియతిరిగారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను అసెంబ్లీ కార్యదర్శి నరసింహ్మచారి ముఖ్యమంత్రికి వివరించారు. జూబ్లీహాల్‌లో ఉన్న మండలిని ఈ మరమ్మతులు పూర్తికాగానే తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోకి రానుంది. దీనికోసం గత కొంతకాలంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు చైర్మెన్‌, స్పీకర్‌ తనిఖీ చేశారు. వచ్చే శీతాకాల సమావేశాలు కొత్త హాల్‌లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గత వర్షాకాల సమావేశాల్లోనే మండలిని తరలించాలని సర్కారు భావించినప్పటికీ, మరమ్మత్తులు పనులు పూర్తికాకపోవడంతో అది కుదరలేదు. మధ్యాహ్నాం సమయంలో వచ్చిన సీఎం, మరమ్మతులు జరుగుతున్న సమావేశం హాల్‌ ప్రధానంగా పరిశీలించారు. సీట్ల ఏర్పాటు, ప్రధాన ధ్వారం గ్రాండ్‌గా ఉండాలని సూచించారు. మీడియా గ్యాలరీ, విజిటర్ల గ్యాలరీ గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న క్యాబిన్లు ఉండరాదనీ, విశాలంగా ఉండాలని సూచించారు. మెయిన్‌ కౌన్సిల్‌ భవనంలో ఎక్కువ సేపు గడిపారు. అర్కిటెక్ట్‌తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం చేసిన సలహాలు, సూచనలతో మరోసారి మెయిన్‌ హాల్‌ను పనులను సమీక్షించి, మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. చైర్మెన్‌, స్పీకర్‌తో కలిసి అసెంబ్లీలో సీఎం భోజనం చేశారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బియ్యాని మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -