- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -