పేద వడిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
నవతెలంగాణ – నెల్లికుదురు
మహబూబాద్ అభివృద్ధి ప్రదాత డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించినట్లు మాజీ వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్ మాజీ సర్పంచ్ పెరుమాండ్ల మల్లేశం తెలిపారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన నలమాస విజయ్ కి బొల్లు చంద్రయ్యకు చెక్కులను శుక్రవారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలమాస విజయ్ మరియు బొల్లు చంద్రయ్య అనారోగ్యంతో బాధపడి ప్రైవేటు దావాఖానలో తాను ట్రీట్మెంట్ చేయించుకున్నారని తాను ఆర్థికంగా నష్టపోకుండా ఉండడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెచ్చాడని వాటిని వారి ఆదేశాల మేరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేద వాడిని ఆదుకువడమే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంలో తాళ్ల చిన్న ప్రభాకర్ యాకయ్య వీరేందర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES