నవతెలంగాణ – తిమ్మాజిపేట
సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నాగర్ కర్నూల్ పట్టణం, బిజినపల్లి, తిమ్మాజిపేట మండలాలకు మంజూరైన కుటుంబలకి సీఎం సహాయనిది చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది ఆదుకుంటుందని అన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు మండల అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



