నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా నిన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అయిన రేవంత్ రెడ్డి అక్కడ ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- Advertisement -
- Advertisement -