Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసామాన్యుడిలా ట్యాంక్ బండ్పై సీఎం రేవంత్ రెడ్డి

సామాన్యుడిలా ట్యాంక్ బండ్పై సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనాలు నేటితో ముగుస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నారు. గణేష్‌ నిమజ్జనాలను స్వయంగా పరిశీలించారు. క్రేన్‌ నంబర్-5 దగ్గర నిమజ్జనాలను సీఎం కొద్దిసేపు చూసి అక్కడ నుంచి వెళ్లారు. పోలీసులు, సిబ్బందితో నిమజ్జన ఏర్పాట్లపై మాట్లాడారు. సీఎం ఎలాంటి కాన్వాయ్ లేకుండా, రెండు మూడు వాహనాల్లో సింపుల్గా ఎన్టీఆర్ మార్గ్ దగ్గరకు వెళ్లి నిమజ్జనాలను వీక్షించడం విశేషం. ముఖ్యమంత్రి ఆకస్మికంగా అక్కడకు వెళ్లడంతో సీఎంను చూసి సామాన్యులు ఆయనతో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. అందరినీ పలకరిస్తూ.. షేక్ హ్యాండ్ ఇస్తూ ముఖ్యమంత్రి ముందుకు కదిలారు. సామాన్య భక్తులతో సీఎం ఫొటోలు దిగి, సెల్ఫీలు ఇస్తూ అందరితో సరదాగా ఉన్నారు. పోలీసులు అలర్ట్గా ఉండటంతో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదు. నిమజ్జనాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని పోలీసులకు సూచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -