- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక.. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చలు ప్రారంభిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి కేరళలోని కొచ్చికి పయనమవుతారు. కొచ్చి నుంచి హెలికాప్టర్లో అలెప్పి చేరుకుని కేసీ వేణుగోపాల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగు పయనమై సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. వెంటనే అసెంబ్లీకి చేరుకుని పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో పాల్గొంటారు.
- Advertisement -