Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభయ హస్తం కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

అభయ హస్తం కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

ఆలయంలో ప్రత్యేక పూజలు
నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని అభయ హస్తం కాలనీలో మల్యాల గోవర్ధన్, ధ్యారంగుల కృష్ణ ల ఆధ్వర్యంలో అభయ హస్తం కాలనీ గల నర్మదా బాణా శివలింగం ఆలయంలో ఆయన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అభయహస్తం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ధ్యారంగుల కృష్ణ ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ ల ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం పాదయాత్ర నిర్వహించి , కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది అన్నారు.

ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలకు అభయహస్తం అని పెట్టడం వల్ల, ఆయన స్ఫూర్తితోనే నిజామాబాద్ నగరంలో నివాస ప్రాంతానికి అభయహస్తం కాలనీ అని నామకరణం చేసుకోవడం జరిగింది అని అన్నారు, నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే కాకుండా, సన్న బియ్యంతో ప్రజలకు కడుపు నింపుతున్నారు, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం, 500 కే సబ్సిడీ సిలిండర్, ఇలాంటి పథకాలు అమలు చేయడంవల్ల పేద ప్రజలపై ఆర్థిక భాగం తగ్గిందని అన్నారు, రేవంత్ రెడ్డి  ఆయుర్ ఆరోగ్యాలతో, ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందే విధంగా వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ, అభయ హస్తం కాలోని నాయకులు రాజారాం తిమ్మయ్య జమీర్ సునీత షబానా సాయన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -