- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రేపటి నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మహబూబ్‌నగర్(D) దేవరకద్రలో ఓ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎల్లుండి కామారెడ్డి జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తారని సమాచారం. లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు వీలును బట్టి దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తారని తెలుస్తోంది.
- Advertisement -