- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పిల్లి
ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స చేసుకున్న ఇందల్ వాయి మండలం లోని మల్లాపూర్ గ్రామానికి చెందిన సున్నం నరేష్ కు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సహకారంతో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి చొరవతో శుక్రవారం బాధిత కుటుంబానికి రూ. 60,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ తోపాటు తదితరుల కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -