మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదల్ల యాదవ రెడ్డి
నవతెలంగాణ- నెల్లికుదురు
మండల కేంద్రానికి చెందిన బందరపు ఉపేందర్ కి లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎంపీ బలరాం నాయక్ సహకారంతో సోమవారం అందించినట్లు మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ నేను అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసుకోగా సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసుకున్నానని అన్నారు. నాకు ఈ చెక్కు ఒక లక్ష రూపాయల చెక్కును ఇప్పించడానికి సహకరించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డికి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్ల కు మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ లకు కృతజ్ఞతలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెరుమండ్ల జగన్ బాబు బందారపు వేణు, గుగులోత్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



