– ఎన్నికల నియమావళిని పాటించని నాయకులు
– దర్జాగా ఆర్ఎంపీ డాక్టర్ చే ఆరోగ్య శిబిరం ఏర్పాటు
నవతెలంగాణ నవాబుపేట: మండల పరిధిలోని కేశవరావుపల్లి గ్రామంలో కొందరు నాయకులు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా 15 రోజులకు ఒకసారి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన తర్వాత కోడ్ ముగియక ముందే ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఎంబిబిఎస్ డాక్టర్ చే వైద్య సేవలు అందించడం పాటించకుండా ఆర్ఎంపీ డాక్టర్ తో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉదంతాన్ని నవతెలంగాణ దినపత్రిక ప్రతినిధి ఆదివారం వెలుగులోకి తెచ్చారు.
ఆర్ఎంపీ డాక్టర్ కు ఎలాంటి అనుభవం లేని డాక్టర్లచే క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు నిషేదిత మందులు ఇష్టానుసారంగా ఇచ్చి ప్రజలను మరింతగా అనారోగ్యానికి గురి చేస్తే బాధ్యులు ఎవరు అని జరగరానిది ఏమైనా జరిగితే బాద్యులెవరని గతంలో ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్ లచే వైద్యం వికటించి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంబిబిఎస్ డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తామని మాటిచ్చిన సర్పంచ్ వెంకటయ్య, మాజీ సర్పంచ్ రజనీ రమేష్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ డాక్టర్ చే ఆరోగ్య సేవలు అందించడం విడ్డూరమని మండిపడ్డారు.
అనుభవం లేని అర్హత లేని డాక్టర్లచే వైద్య సేవలు ఎలా అందుతాయని తూతూ మంత్రంగా సేవలందించడంతో పాటు ఎన్నికల నియమాలని పాటించకుండా కోడ్ ఉల్లంఘిస్తున్నారని వెంకటయ్య సర్పంచి పై స్థానిక నాయకులపై మండిపడుతున్నారు.ఈ తతంగం అంతా కొనసాగిస్తున్న వారిపై కోడ్ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



