Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కందిపంటకు సర్దిరోగం

కందిపంటకు సర్దిరోగం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్, డోంగ్లి, మండలాల పరిధిలో ఈ ఏడాది సాగుచేసిన కంది పంట రైతన్నలకు కంటతడి పెట్టిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంది పంటకు సర్ది రోగం వస్తుందని రైతులు తెలిపారు. దీంతో కంది పంట పూర్తిగా చనిపోయి ఎండిపోతుందన్నారు. మద్నూర్ ఉమ్మడి మండలంలో ఈ ఏడాది కంది పంట సాగు 4 వేల ఎకరాలకు పైగా వేశారు. ఈ సీజన్ లో కంది, సోయా పంటలు అత్యధికంగా వేశారు. మొత్తం నాలుగు వేల ఎకరాల వరకు సాగు అయింది. అయితే ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు సాళ్ళ కొద్ది పంట సర్ది రోగం పట్టి, పూర్తిగా చనిపోయి, ఎండిపోతుంది. ఒక్కొక్కరి చేనుల్లో సగానికి పైగా ఎండిపోయింది. మిగతాది కూడా చనిపోయే చనపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ ఈ మధ్యలో వర్షాలు పడితే పూర్తిగా నాశనం అయ్యే విధంగా ఉందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -